Bonacaud Banglow Real Story in Telugu 2025
బోన్సావుడ్ బంగ్లా తిరువనంతపురం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవుల మధ్యలో “Bonacaud Estate” అని ఒక ప్రదేశం ఉంది. చుట్టూ పచ్చగా, మబ్బలు అలుముకున్నట్టు చుట్టూ తోటల మధ్యలో ఉన్నా, ఈ ప్రదేశంలో అనేకమైన ప్రచారాలు జరుగుతున్నాయి. “Bonacaud Bungalow” 150 ఏళ్ల పాత బంగ్లా.ఆ బంగ్లాను 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి అయిన విలియం మాథ్యూ అనే వ్యక్తి నిర్మించాడు. అతనీ భార్య మేరీ, పిల్లతో అక్కడ నివసించేవాడు. కానీ ఏమైందో ఏమో ఒక రాత్రి, ఆ కుటుంబం కనిపించకుండా పోయింది.
తరువాత రోజు పనికి వచ్చిన కూలీలు రక్తపు చారలతో ఉన్న గోడలు, తలుపులపై ఎవరో గిరినట్టుగా ఉన్న గుర్తులు విరిగిన బొమ్మలు చూసి పరుగులు తీశారు. ఆ తరువాత ఎవర్ కూడా ఆ బంగ్లా వైపు వెళ్లలేదు.కానీ 2023లో, చెన్నైలో ఉండే ఓ ట్రావెల్ వ్లాగర్ జంట అక్కడికి వచ్చింది.వీరు haunted places గురించి వీడియోలు తీసి యూట్యూబులో పెట్టేవారు.కానీ ఈ సారి వారు నిజమైన హర్రర్ చూపించాలన్న ఉత్సాహంతో “Bonacaud Bungalow Mystery” అనే టైటిల్తో ఒక వీడియో చేయాలని నిర్ణయించుకున్నారు.రాత్రి 8 గంటలకు, వారు అడవిలోకి బయలుదేరారు. వర్షం మొదలైంది. చీకటిలో టార్చ్‌లైట్ మాత్రమే మార్గం చూపుతోంది. GPS సిగ్నల్ పోయింది, కానీ అర్జున్ కు ఆ చోటు బాగా గుర్తుంది.
కొద్ది దూరం తర్వాత పెద్ద రాతి బంగ్లా కనిపించింది. బంగ్లాకు దగ్గరగా వెళ్తుంటే గాలి ఒక్కసారిగా చల్లబడింది, చెట్ల ఆకులు అటువైపు వెళ్లొద్దు అన్నట్టుగా సౌండ్ చేస్తున్నాయి.ఇద్దరు బంగ్లాలోకి ప్రవేశించగానే ప్రియా కెమెరాను ఆన్ చేసి “Friends, this is Bonacaud Bungalow…” అని మొదలుపెట్టగానే లోపల నుంచి తలుపు కీచుమనిపించింది. ఇద్దరూ స్థంభించారు. అర్జున్ ధైర్యం చేసి తలుపు తెరిచాడు. లోపల నిశ్శబ్దం. గోడలపై ఉన్న ఫ్రేములు, నేలపై పాడైపోయిన ఫర్నిచర్, మరియు ఒక మూలలో పాత పియానో కనిపించాయి.అర్జున్ పియానో దగ్గరికి వెళ్లి కీలు తాకగా అది ఒక్కసారిగా స్వయంగా స్వరమాధుర్యాన్ని వినిపించింది. ప్రియా వెంటనే వెనుకకు తొంగి చూశింది — పియానో దగ్గర ఎవరూ లేరు. టార్చ్ లైట్ లెఫ్ట్ సైడ్ తిప్పింది, గోడపై “Come Back William” అని రక్తరంగుతో రాసినది కనిపించింది. ప్రియా భయంతో బయటకు రావాలని కోరింది, కానీ అర్జున్ ఇంకా బంగ్లా అంతా చిత్రీకరించాలనుకున్నాడు. వారిద్దరూ పైకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న పాప పాత టాయ్ బేరుతో కూర్చొని ఉంది. కెమెరాలో zoom చేస్తే, ఆ పాప అకస్మాత్తుగా తల తిప్పి అర్జున్ వైపు చూసింది.
ఆమె ముఖం రక్తం నిండిన కళ్ళతో చూస్తోంది.క్రమంగా కెమెరా ఫ్లిక్ అవడం మొదలైంది. స్క్రీన్ సిగ్నల్ మీద “Static” వచ్చింది. తర్వాత మైక్రోఫోన్‌లో ఒక చల్లని బాలస్వరంలో “Why did you come back?” అనే ఆంగ్ల వాక్యం వినిపించింది. అర్జున్ కెమెరా ఆఫ్ చేశాడు కానీ ఆ స్వరం ఇంకా ఆ బంగ్లా అంతటా ప్రతిధ్వనిస్తోంది.రాత్రి భయానక వాతావరణంఅప్పటికే వెలుపల మేఘాలు గట్టిగా రేకెత్తాయి. వాన పెరిగింది. బంగ్లా తలుపులు ఒక్కొక్కటిగా తడుతూ మూసుకుపోయాయి. ప్రియా అరుస్తుంటే ఆమె వెనుక ఒక తెల్లచొక్కాలో ఉన్న స్త్రీ చెయ్యి కనిపించింది. అర్జున్ ఆ సన్నివేశాన్ని చూసి కుదేలయ్యాడు.అమాంతంగా ఆ స్త్రీ నిన్ననే సజీవంగా ఉన్నట్టుగా కనిపించి, “Stay with us forever…” అంటూ ముందుకు వచ్చింది. ఆమె ముఖం కరిగి, రక్తనయనాలు పేలిపడ్డాయి. ప్రియా కేక వేస్తూ జారిపడింది.అర్జున్ ఆమెను లేపడానికి ప్రయత్నించగా, నేల కింద నుంచి చిన్న పిల్ల నవ్వు వినిపించింది. ఒక పాత చాయ్ కప్పు తానే తాను కదిలి వాన కిటికీకి ఎగిరిపోయింది.మాయా అడవిఅర్జున్ ఆమెను పట్టుకుని బయటకు పరుగెత్తాడు, కానీ బంగ్లా గేటు దాటి అడవిలోకి వచ్చినప్పుడు మార్గం కనిపించలేదు.
ప్రతి దారి మళ్లీ మళ్లీ అదే బంగ్లాకు తీసుకెళ్తోంది. గడియారం 3 గంటలు చూపిస్తోంది, కానీ ఆ సమయం నుండి మళ్లీ మొదలవుతోంది — “3:00 … 3:00 … 3:00”.టార్చ్ లైట్ ఆపి తిరిగి చూస్తే, ప్రియా అక్కడ లేదు. ఆమె స్థానంలో పాతకాలపు ఫోటోలో ఉన్న మేథ్యూ కుటుంబంలోని మానవులలో ఒకరిలా కనిపించే స్త్రీ నిలబడి ఉంది. ఆమే పియానో తాకి నవ్వింది. అర్జున్ “Where is Priya!” అని కేక వేశాడు. ఆ సమయంలో తలుపులు మూసుకుపోయాయి, కెమెరా కింద పడిపోయింది.ఉదయం తరువాతమరుసటి ఉదయం పోలీసులు మరియు ఫారెస్ట్ అధికారులు విచారణకు వచ్చారు. వారి డ్రోన్ దృశ్యాలలో బంగ్లా ముందు అర్జున్ కెమెరా దొరికింది. చివరి క్లిప్‌లో అర్జున్ ఉక్కిరిబిక్కిరి అవుతూ “Please don’t…” అని చెప్పే దృశ్యం కనిపించింది, ఆ తర్వాత కెమెరా పడిపోవడం, పియానో స్వరం వినిపించడం, చివరగా ఒక పిల్ల నవ్వు.తదుపరి అరవై రోజుల తర్వాత బంగ్లాను మూసేశారు. “Restricted Area” బోర్డు పెట్టారు. కానీ స్థానికులు రాత్రివేళ పియానో స్వరాలు ఇంకా వినిపిస్తాయని చెబుతున్నారు. కొందరు రాత్రి వెళ్లి చూసినవారు తిరిగి రాలేదని అంటారు. Bonacaud బంగ్లా నేడు కూడా అందరినీ ఆకర్షించే భయానక మర్మంగా మిగిలిపోయింది.