నా పేరు అర్జున్.నేను జాబ్ కోసం అని తమిళనాడు క్యాపిటల్ అయిన మద్రాసుకు వచ్చాను.నాకు ఇక్కడ అదే మొదటిసారి.ఎవ్వరు తెలియదు.ఐతే మా ఆఫీసుకు దగ్గర్లో నాకు ఒక హాస్టల్ దొరికింది. ఇంకా నేనుకూడా ఒక్కడినే కాబట్టి ఎలాగో అలా అడ్జస్ట్ అవుతూ ఉండడం మొదలుపెట్టాను. మనం హైదరాబాద్ వాళ్ళం కదా మనకు పక్క రాష్ట్రం వాళ్ళ వంటలు అంతా త్వరగా రుచికరంగా అనిపించవు నాకు కూడా మొదట్లో ఫుడ్ నచ్చక బాగా ఇబ్బంది పడేవాడిని అయినా కూడా ఎలాగో అలా అడ్జస్ట్ అయ్యి ఉంటూ జాబ్ చేసుకునేవాడిని. అలా నాకు సంవత్సరం గడిచిపోయింది. ఆఫీసులో కొలీగ్స్ పరిచయం అయ్యారు పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది అయితే వాళ్లు కూడా నాలాగే హాస్టల్ ఫుడ్ పడక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లు కూడా హాస్టల్ ఫుడ్ అంత బాగుండడం లేదు అని చెప్పేసి అనడంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. దీంతో మనమందరం ఎందుకు ఒక రూమ్ తీసుకొని ఉండకూడదు అని అన్నాను. అంతే అందరూ దానికి సరే అన్నారు .
మేమంతా ఒక ఐదుగురం ఉంటాం మేమంతా కలిసి దగ్గర్లో రూమ్ తీసుకొని ఉందాం అని అనుకున్నాం అనుకున్నదే తడవుగా రూమ్ వెతకడం మొదలుపెట్టాం నేను మా ఇద్దరి ఫ్రెండ్స్ కలిసి మా ఆఫీస్ కు దగ్గరలో ఉన్న కాలనీలో ఇల్లు కోసం వేతకడం ప్రారంభించాం.. అలా దాదాపు రెండు గంటల నుంచి వెతుకుతూ ఉండంగా మాకు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు పక్కనే కూర్చుని ఉన్న ఒక ముసలావిడను అడగగా ఆమె ఇక్కడ మీకు ఒక ఇల్లు కూడా దొరకదు మీరు ఈ కాలనీకి అనుకొని ఉన్న వాల్మీకి నగర్లో వెతకండి మీకు అక్కడ ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది అని అన్నది. మేము వెంటనే మాకు దగ్గరలో ఉన్న వాల్మీకి నగర్ కి వెళ్లి వెతుకుతూ ఉండంగా ఒక దగ్గర ఎఫ్2 బ్లాక్ ఖాళీగా ఉంది అని దాన్ని అద్దెకు ఇస్తాం అని అనడంతో మేము ఎఫ్2 బ్లాక్ ని అద్దెకు తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ ను అతనికి ఆ బ్లాక్ నచ్చలేదు అయినా మా నలుగురి కోసం అతను అడ్జస్ట్ అయ్యి అందులో నాతోపాటు ఉండసాగాడు.
అంతా బాగుంది మేము ఆ బిల్డింగ్ లోకి అందరూ వచ్చాము. ఒకరోజు డ్యూటీ అయిపోయింది అందరూ పార్టీ చేసుకుంటున్నాను అప్పుడు సమయం దాదాపు 12 దాటింది అనుకుంటా అప్పుడు ఒక లేడీ మా డోర్ ని నాకు చేసింది. నేను వెళ్లి డోర్ తీసాను. అప్పుడు ఆమె లోపలికి రావచ్చా అని అడిగింది నేను ఎవరండి మీరు ఎందుకు ఈ టైం లో వచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించాను. నేను చెప్తానండి నన్ను లోపలికి రానిస్తారా అని అంది నేను మాట్లాడే లోపే మా ఫ్రెండ్ ఒకతను ఎవర్రా అంటూ వచ్చి చూశాడు. తాను లోపలికి రండి అంటూ పిలిచాడు. తాను లోపలికి వచ్చిన తర్వాత మేము ఆమెతో మాట్లాడుతూ ఉండంగా ఆమె ఒక్కసారిగా మాటలు చూసే చూపులో వేరియేషన్ చూపించింది నాకు వెంటనే భయమేసింది. మాలో ఒక ఫ్రెండ్ ఏం భయపడకు అంటూ ధైర్యం చెప్పి తనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇంతలో ఫ్లాట్ అంతా కరెంట్ పోయింది. మేం క్యాండిల్ లైట్ వెలిగించి చూస్తే ఆమె మా ఎదురుగా లేదు ఎక్కడికి వెళ్ళింది అని తిరిగి చూశాను ఇంతలోపు కరెంటు వచ్చింది. కరెంట్ వెలుతురు వచ్చిన తర్వాత ఆ దృశ్యాన్ని చూసి మేము ఒక్కసారిగా కంగుతున్నాం ఎందుకంటే అక్కడ ఎదురుగా హ్యాండ్ చేసుకుని ఇంతకుముందు లోపలికి వచ్చిన అమ్మాయి చనిపోయి ఉంది. అది చూసిన నాకు భయమేసి నేను బిల్డింగ్ బయటికి వచ్చేసాను మా ఫ్రెండ్స్ మాత్రం అలాగే అక్కడే ఉండిపోయారు.
నేను రాత్రంతా బయటే పడుకొని మార్నింగ్ లోపలికి వెళ్లాను వెళ్లి చూసేసరికి మా ఫ్రెండ్స్ అంతా ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుని ఉన్నారు. నాకు వెంటనే భయం వేసి నేను అక్కడి నుంచి చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను వస్తూ ఉంటే నన్ను ఒక వ్యక్తి ఆపి ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏమైంది ఎందుకంత భయపడుతున్నావ్ అని అడిగారు నేను జరిగిన విషయం చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి అది ఒక భయానకమైన ప్లేస్ మీకు ఎవరు ఆ ఇల్లు అద్దెకు ఇచ్చారు ఆ ఇంట్లో దయ్యం ఉంది ఆ ఇంట్లోకి వచ్చిన ఎవ్వరు కూడా ప్రాణాలతో బయటపడ్డ చరిత్ర లేదు నువ్వు ఎలా బయటికి వచ్చావు అని అన్నారు నేను అసలు ఏమైంది ఎవరు ఆ అమ్మాయి అని అన్నాను ఇంతకుముందు ఉన్న ఆ ఇంటి ఓనర్ యొక్క కూతురు ఆమె ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్న లేదా ఆ ఇంటి నీ కొనుక్కున్నా కూడా ఆమె ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టదు అని అన్నాడు అది విన్న నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయింది.